శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
shaashvathamaina preemathoo nanu preeminchaavayyaa
శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా నీ ప్రేమే నను గెల్చెను విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా నీ కృపయే నను మార్చెను నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం నీ ప్రేమ తేనె కంటే మధురము నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను వెంబడింతును ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో… యేసయ్యా నిను ఆరాధింతును ||శాశ్వతమైన||
shaashvathamaina preemathoo nanu preeminchaavayyaa nee preemee nanu gelchenu viduvaka nee krupa naa yeda kuripinchinaavayyaa nee krupayee nanu maarchenu nee preema unnatham – nee preema amrutham nee preema theene kantee madhuramu nee preema loothuloo – nanu nadupu yeesayyaa nee preemalooni nee veeru paari neekai jeevinchinaa preemathoo… preemathoo… yeesayyaa ninu venbadinthunu preemathoo… preemathoo… preemathoo… yeesayyaa ninu aaraadhinthunu ||shaashvathamaina||
నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా దృష్టించి నిర్మించిన ప్రేమ నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే గ్రంధములో లిఖియించిన ప్రేమ నా ఎముకలను నా అవయములను వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ నీ కోసం సృజియించావయ్యా నను మురిపెంగా లాలించావయ్యా నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు నను విడువక వెంటాడిన ప్రేమ నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు నా కోసం వేచిచూచిన ప్రేమ బాల్య దినముల నుండి నను సంరక్షించి కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ యవ్వన కాలమున కృపతో నను కలిసి సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ యేసయ్యా నను దర్శించినావయ్యా నను ప్రత్యేకపరిచావేసయ్యా నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ తన సొత్తుగా చేసుకున్న ప్రేమ విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి నా విలువని పెంచేసిన ప్రేమ లోకమే నను గూర్చి చులకన చేసినను తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ యేసయ్యా… యేసయ్యా… నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… నను నీలా మార్చేందులకేనయ్యా పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు కరుణించి పైకి లేపిన ప్రేమ నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ నను చంకన ఎత్తుకున్న ప్రేమ నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ నను మరలా సమకూర్చావేసయ్యా నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన నా తోడై ధైర్యపరచిన ప్రేమ చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ లోకమే మారిననూ మనుషులే మరచిననూ మరువనే మరువదుగా నా యేసు ప్రేమ తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ నా విశ్వాసం కాపాడవయ్యా బంగారంలా మెరిపించావయ్యా ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని అందలమును ఎక్కించిన ప్రేమ పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ శాశ్వత జీవం నాకిచ్చావయ్యా నను చిరకాలం ప్రేమిస్తావయ్యా
naa thalli garbhamunandu nee pindamunaiyundamgaa drusstinchi nirminchina preema naa dinamulaloo okataina aaranbhamu kaakamunupee grandhamuloo likhiyinchina preema naa emukalanu naa avayamulanu vinthagaa ediginchi ruupinchina preema thalli odiloo neenu paalu thraaguchunnappudu nammikanu naaloona puttinchina preema thana sontha poolika ruupuloona nanu srusstinchina preema nee koosam srujiyinchaavayyaa nanu muripengaa laalinchaavayyaa nee prabhuvunu erugaka yundi ajnyaanamuthoo unnappudu nanu viduvaka ventaadina preema naa srusstikarthanu guurchi smarannee naaloo leenappudu naa koosam veechichuuchina preema baalya dinamula nundi nanu sanrakssinchi kanti reppalaa nannu kaapaadina preema yavvana kaalamuna krupathoo nanu kalisi sathyamunu boodhinchi veliginchina preema nee vedakakunnanu naaku doriki nanu brathikinchina preema yeesayyaa nanu darshinchinaavayyaa nanu prathyeekaparichaaveesayyaa nee paapinai yundagaanee naakai maranninchina preema thana soththugaa cheesukunna preema viluvee leenatti naakai thana praannapu viluvani chellinchi naa viluvani pencheesina preema lookamee nanu guurchi chulakana cheesinanu thana drusstiloo neenu ghanudanna preema evaruu leekunnaa neenu neeku saripoonaa neevu bahu priyudavani balaparachina preema naa muddu bidda nuvvantuu nannu thega muddaadina preema yeesayyaa… yeesayyaa… naapai intha preema eentayyaa yeesayyaa… yeesayyaa… yeesayyaa… nanu neelaa maarcheendulakeenayyaa palu maarlu nee paadinappudu bahu chikkulaloonunnappudu karunninchi paiki leepina preema neenee ninu cheesaanantuu neenee bhariyisthaanantuu nanu chankana eththukunna preema naa thappatadugulu thappakunda sari cheesi thappulanu maanpinchi sthiraparachina preema nannu batti maaradugaa nannu cheeradeesenugaa ssarathulee leenatti naa thandri preema thanakisstamaina ghanamaina paathragaa nanu malachina preema nanu maralaa samakuurchaaveesayyaa nee saakssyangaa nilabettaavayyaa kasstaala kolumulloona kanneeti looyalloona naa thoodai dhairyaparachina preema chelareegina thuphaanulaloo edathegani pooraatanloo thana maatathoo shaanthinichchindi preema lookamee maarinanuu manussulee marachinanuu maruvanee maruvadugaa naa yeesu preema thallilaa preeminchi thandrilaa boodhinchi aaloochana cheppi vidipinchina preema kssannamaathramaina nanu veedipooni vaathsalyatha gala preema naa vishvaasam kaapaadavayyaa bangaaranlaa meripinchaavayyaa uuhinchaleenatuvanti krupaalani naapai kuripinchi naa sthithi gathi maarchiveesina preema naa sontha shakthithoo neenu ennadunu pondagaleeni andalamunu ekkinchina preema pakssi raaju rekkalapai nithyamu nanu moosthuu shikharamupai nannu nadipinchu preema parvathaalapai eppudu kreesthu vaartha chaatinchee sundarapu paadamulu naakichchina preema thana raayabaarigaa nannu unchina yeesee ee preema shaashvatha jeevam naakichchaavayyaa nanu chirakaalam preemisthaavayyaa