యేసు రాజ్యమునకు సైనికులం పరమునకు
yeesu raajyamunaku sainikulam paramunaku
యేసు రాజ్యమునకు సైనికులం పరమునకు మనమే వారసులం (2) ప్రేమ పంచిన దేవుని శిష్యులం ఎదురు బెదురూ ఎరుగని వారలం కారు చీకటి కమ్మిన లోకము కాదు మన ప్రభువుకు సమ్మతము ఆత్మలు నశియించుట ఘోరము వారి రక్షణయే మన భారము వెలుగే మనమని సెలవిచ్ఛేనని అప్పగించిన పని జరిగింతుము (2) ||ప్రేమ పంచిన||
yeesu raajyamunaku sainikulam paramunaku manamee vaarasulam (2) preema panchina deevuni shissyulam eduru beduruu erugani vaaralam kaaru cheekati kammina lookamu kaadu mana prabhuvuku sammathamu aathmalu nashiyinchuta ghooramu vaari rakssannayee mana bhaaramu velugee manamani selavichchheenani appaginchina pani jariginthumu (2) ||preema panchina||
వలదు నీ మదిలో సందేహము ప్రభువే పెంచునుగా నీ జ్ఞానము తగిన రీతి తలాంతులు నొసగును నిన్ను అద్భుత పాత్రగా మలచును నీకు భారము మదిలో మెదిలితే ప్రభువే మార్గము చేయును సరళము నీవు పొందిన సువార్త ఫలము ఇతరులకు పంచుటయే ఘనము సాక్ష్యమును చాటించే ధైర్యము లోకమునకు చూపించును నిజము కోత ఎంతగ ఉంది విరివిగా కోయుదాము ప్రభు పనివారుగా
valadu nee madiloo sandeehamu prabhuvee penchunugaa nee jnyaanamu thagina reethi thalaanthulu nosagunu ninnu adbhutha paathragaa malachunu neeku bhaaramu madiloo medilithee prabhuvee maargamu cheeyunu sarallamu neevu pondina suvaartha phalamu itharulaku panchutayee ghanamu saakssyamunu chaatinchee dhairyamu lookamunaku chuupinchunu nijamu kootha enthaga undi virivigaa kooyudaamu prabhu panivaarugaa